పురుగుమందు తాగి ఉద్యోగి ఆత్మహత్య

పురుగుమందు తాగి ఉద్యోగి ఆత్మహత్య

గుంటూరు: అనారోగ్యంతో బాధపడుతూ ప్రైవేట్ ఉద్యోగి పురుగుమందు తాగి ఆత్మహత్య చేసుకున్న ఘటన మేడికొండూరులో జరిగింది. మందపాడుకు చెందిన నాగభూషణం(32) ఓ ప్రైవేట్ కంపెనీలో పనిచేస్తున్నాడు. అనారోగ్య సమస్యలతో శుక్రవారం మనస్తాపానికి గురై ఇంట్లోనే పురుగుల మందు తాగాడు. కుటుంబసభ్యులు గమనించి ఆసుపత్రికి తీసుకెళ్లగా చికిత్స పొందుతూ మరణించాడు.