VIDEO: ఉపాధ్యాయ సమస్యలను పరిష్కరించాలి

ASR: ఉద్యోగ, ఉపాధ్యాయుల సమస్యలను వెంటనే పరిష్కరించాలని ఆంధ్ర ప్రదేశ్ టీచర్స్ ఫెడరేషన్ జిల్లా ఉపాధ్యక్షులు శ్యాం సుందర్, పాడేరు, హుకుంపేట మండలాల అధ్యక్షులు పోతురాజు, సత్యారావు డిమాండ్ చేశారు. ఈ మేరకు సోమవారం ఏపీటీఎఫ్ ఆధ్వర్యంలో పాడేరు తహసీల్దార్ కార్యాలయం ఎదుట నిరసన తెలిపారు. 12 పీఆర్ సీ కమిషన్ నియమించాలని, 30 శాతం హైయర్‌ను ప్రకటించాలని నినాదాలు చేశారు.