ప్రైవేట్ ఆసుపత్రి డాక్టర్‌ను అరెస్ట్ చేసిన సీఐ
KDP: వేంపల్లిలోని స్థానిక ZPHS పాఠశాల ఎదురుగా నిబంధనలకు విరుద్ధంగా నిర్వహిస్తున్న ప్రైవేట్ ఆసుపత్రి డాక్టర్ విజయకుమారును అరెస్టు చేసినట్లు సీఐ నరసింహులు తెలిపారు. సోమవారం ఆయన మాట్లాడుతూ.. ఈ నెల 11వ తేదీన డిప్యూటీ డిఎంహెచ్వో కాజా మొయిద్దీన్ ఆసుపత్రిని తనిఖీ చేయగా కాన్పులతోపాటు అల్లోపతి వైద్యం చేయడంతో ఆపరేషన్ థియేటర్,OP రూములను సీజ్ చేయడం జరిగిందన్నారు.