డ్రైనేజీలో పడిన వ్యక్తి.. తప్పిన ప్రమాదం

మహబూబ్ నగర్ పురపాలక పరిధిలోని భగీరథ కాలనీ రోడ్ నెం.2లో శనివారం రాత్రి ఒక వ్యక్తి డ్రైనేజీ కాలువలో పడి అపస్మారక స్థితిలోకి వెళ్లాడు. విషయం తెలిసిన కాంగ్రెస్ పార్టీ వార్డు ఇంఛార్జ్ కృష్ణకాంత్ రెడ్డి వెంటనే అక్కడికి చేరుకుని అతడిని బయటకు తీశారు. అనంతరం అతడు స్పృహలోకి వచ్చాడని తెలిపారు. స్థానికులు అప్రమత్తంగా ఉండాలని ఆయన సూచించారు.