VIDEO: నరసన్నపేట పట్టణంలో నీటి కష్టాలు
SKLM: నరసన్నపేట పట్టణంలో ముద్దాడ వీధిలో గత పది రోజులుగా కుళాయిలు రాక అనేక అవస్థలు పడుతున్నామని స్థానిక మహిళలు పేర్కొన్నారు. వేసవికాలం సమీపించడంతో అప్పుడే నీటి ఎద్దడి మొదలైందని మహిళలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. దీనిపై సంబంధిత అధికారులు స్పందించి నీటి సమస్య లేకుండా వెంటనే పరిష్కరించాలని కోరుతున్నారు.