ఘనంగా జనసేన ఆవిర్భావ దినోత్సవ వేడుకలు
KDP: సిద్ధవటంలో జనసేన పార్టీ13వ. ఆవిర్భావ దినోత్సవ వేడుకలు ఇవాళ ఘనంగా జరిగాయి. రాజంపేట పార్లమెంట్ జనసేన సమన్వయకర్త అతికారి కృష్ణ ఆధ్వర్యంలో 55 అడుగుల జనసేన జెండాను ఆవిష్కరించి కేకు కట్ చేసి సంబరాలు చేసుకున్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. గ్రామ గ్రామాన జనసేన పార్టీ రెపరెపలలాడే విధంగా ఒక పండగ వాతావరణంలో జెండాను ఆవిష్కరించి ఆవిర్భావ దినోత్సవ వేడుకను నిర్వహించామని తెలిపారు.