ఢిల్లీ బయలుదేరిన మంత్రులు

HYD: బీసీలకు 42% రిజర్వేషన్ల బిల్లును ఆమోదించాలన్న డిమాండ్‌తో మంత్రులు పొన్నం, సీతక్క, కాంగ్రెస్ ఎమ్మెల్యేలు, బీసీ సంఘాల నేతలు ఢిల్లీ బయలుదేరారు. తెలంగాణ కాంగ్రెస్ ఢిల్లీలో చేపట్టిన మూడు రోజుల కార్యాచరణలో భాగంగా శంషాబాద్ విమానాశ్రయం నుంచి కాసేపటి క్రితం ఢిల్లీకి బయలుదేరారు. బీసీల హక్కుల కోసం కేంద్రంపై ఒత్తిడికి తేవడానికే కాంగ్రెస్ సంకల్పించిందని మంత్రులు పేర్కొన్నారు.