బాధిత కుటుంబానికి ఆర్థిక సహాయం
NRPT: ధన్వాడ మండల కేంద్రానికి చెందిన రిటైర్డ్ కండక్టర్, సింగల్ విండో మాజీ వైస్ ఛైనర్మన్ నారాయణ గౌడ్ గురువారం రాత్రి మృతి చెందారు. ఆర్టీసీ అధికారులు నారాయణ గౌడ్ అంతక్రియలు నిమిత్తం 30 వేల రూపాయలను శుక్రవారం ఆయన కుటుంబ సభ్యులకు అందజేశారు. మాజీ వైస్ ఎంపీపీ రామచంద్రయ్య, ఏఎంసీ డైరెక్టర్ లక్ష్మణ్, ఆర్టీసీ కండక్టర్లు బాలయ్య, చెన్నప్ప, సాయిలు, వెంకట్ రాములు ఉన్నారు.