అబ్దుల్ కుటుంబాన్ని పరామర్శించిన ఎమ్మెల్యే శిరీషా
ASR: గత నెలలో జరిగిన రోడ్డు ప్రమాదంలో మరణించిన రాజవొమ్మంగి గ్రామానికి చెందిన అబ్దుల్ కుటుంబాన్ని స్థానిక ఎమ్మెల్యే శిరీషా దేవి బుధవారం పరామర్శించారు. అబ్దుల్ తండ్రి, స్థానిక కిరాణా వ్యాపారి అయిన దావూద్‌ను ఎమ్మెల్యే ఓదార్చారు. బాధిత కుటుంబానికి కూటమి ప్రభుత్వం ఎల్లప్పుడూ అండగా ఉంటుందని ఆమె హామీ ఇచ్చారు.