మండపాకలో హర్ ఘర్ తిరిగి ర్యాలీ

W.G: స్వాతంత్య్ర దినోత్సవాన్ని పురస్కరించుకుని తణుకు మండలం మండపాక జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల విద్యార్థులు బుధవారం హర్ ఘర్ తిరంగా ర్యాలీ నిర్వహించారు. పాఠశాల హెచ్ఎం కె.ఫణిశ్రీ ఆధ్వర్యంలో నిర్వహించిన ఈ కార్యక్రమంలో విద్యార్థులు గ్రామంలో ర్యాలీ నిర్వహించి జాతీయ స్ఫూర్తిని పెంపొందించేలా నినాదాలు చేశారు. ఈ క్రమంలో పాఠశాల ఫిజికల్ డైరెక్టర్ సంకు సూర్యనారాయణ పాల్గొన్నారు.