అర్హులైన గిరిజనులకు సంక్షేమ పథకాలు: ఐటీడీఏ పీవో

అర్హులైన గిరిజనులకు సంక్షేమ పథకాలు: ఐటీడీఏ పీవో

BDK: అర్హులైన ప్రతి గిరిజనుడికి ప్రభుత్వ సంక్షేమ పథకాలు అందేలా కృషి చేస్తానని ఐటీడీఏ పీవో రాహుల్ అన్నారు. సోమవారం ఐటీడీఏ కార్యాలయంలో నిర్వహించిన గిరిజన దర్బార్‌లో ఆయన వివిధ ప్రాంతాల నుంచి వచ్చిన గిరిజనుల నుంచి అర్జీలు స్వీకరించారు. అర్జీదారులు సమర్పించిన దరఖాస్తులను పరిశీలించి, అర్హత ఉన్న ప్రతి ఒక్కరికీ ప్రభుత్వ పథకాలు అందేలా చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారు.