మరగుజ్జు సమస్య విన్న మంత్రి

SRD: సంగారెడ్డి కలెక్టర్ కార్యాలయంకు వచ్చిన వైద్య ఆరోగ్య శాఖ మంత్రి దామోదర రాజనర్సింహ అక్కడే ఉన్న మరగుజ్జు సమస్యను సోమవారం విన్నారు. తాను పదవ తరగతి వరకు చదువుకున్నారని అటెండర్ ఉద్యోగం ఇప్పించాలని న్యాల్కల్ మండలం చినగేపల్లికి చెందిన మరగుజ్జు రమేష్ మంత్రిని కోరారు. రమేష్ సమస్య పరిష్కరించాలని అక్కడే ఉన్న కలెక్టర్‌ను మంత్రి ఆదేశించారు.