VIDEO: 'మార్కెట్ అభివృద్ధికి కృషి చేయాలి'
CTR: పలమనేరు వ్యవసాయ మార్కెట్ కమిటీ అభివృద్ధికి చర్యలు తీసుకోవాలని ఎమ్మెల్యే అమర్నాథ్ రెడ్డి సూచించారు. గురువారం పట్టణంలోని తన కార్యాలయంలో మార్కెటింగ్ శాఖ అధికారులు, మార్కెట్ కమిటీ ఛైర్మన్ రాజన్నతో సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా మార్కెటింగ్ శాఖ డీఈఈగా కొత్తగా బాధ్యతలు స్వీకరించిన వినోద్ కుమార్ ఎమ్మెల్యే అమర్నాథ్ రెడ్డి మర్యాదపూర్వకంగా సన్మానించారు.