రైతులకు అండగా నిలవాలి: ఎమ్మెల్యే
ప్రకాశం: కొత్తపట్నం మండల కేంద్రంలో ఆదివారం జరిగిన మండల రైతు సొసైటీ కార్యవర్గ ప్రమాణ స్వీకారం ఘనంగా జరిగింది. ఈ ప్రమాణ స్వీకార కార్యక్రమంలో ఎమ్మెల్యే దామచర్ల జనార్దన్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ.. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు రైతాంగానికి అత్యంత ప్రాధాన్యత ఇస్తున్నారని తెలిపారు. నూతన కమిటీ సభ్యులు అందరూ రైతులకు అండదండగా నిలవాలన్నారు.