మొక్కజొన్న కొనుగోలు కేంద్రం ప్రారంభం
GDWL: జిల్లా కేంద్రంలో మొక్కజొన్న కొనుగోలు కేంద్రాన్ని మార్కెట్ కమిటీ ఛైర్మన్ కుర్వనల్ల హనుమంతు, మున్సిపల్ ఛైర్ పర్సన్ తుమ్మల జయలక్ష్మి ప్రారంభించారు. 2025-26 యాసంగి సీజన్‌కు గానూ క్వింటాకు రూ. 2400 మద్దతు ధర నిర్ణయించినట్లు తెలిపారు. ఈ కేంద్రం ద్వారా గద్వాల, మల్దకల్, ధరూర్, గట్టు, కేటీదొడ్డి మండలాల రైతులకు ప్రయోజనం చేకూరనుంది