85 ఎకరాల్లో ఇసుక మేటలు: ఎంపీడీవో

85 ఎకరాల్లో ఇసుక మేటలు: ఎంపీడీవో

NZB: భీమగల్ మండలంలో కురిసిన భారీ వర్షాలకు 124 మంది రైతుల భూముల్లో సుమారు 85 ఎకరాలలో ఇసుక మేటలు వేసినట్లు అధికారులు ధ్రువీకరించారు. ఉపాధి హామీ సిబ్బందితో ఎంపీడీవో సంతోష్ కుమార్ గురువారం సమావేశం నిర్వహించారు. అధికారులు వెంటనే అంచనాలు తయారు చేసి పనులు ప్రారంభించాలన్నారు. రైతుల అంగీకారం తీసుకుని ఇసుక మెటల తొలగింపు కార్యక్రమం చేపట్టాలని సూచించారు.