చింతపల్లిలో పర్యటించిన పాడేరు ఎమ్మెల్యే

చింతపల్లిలో పర్యటించిన పాడేరు ఎమ్మెల్యే

ASR: చింతపల్లి మండల కేంద్రంలో బుధవారం వైద్య కళాశాలల ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా వైసీపీ కోటి సంతకాల సేకరణ కార్యక్రమం జరిగింది. ఈ కార్యక్రమంలో పాడేరు ఎమ్మెల్యే విశ్వేశ్వరరాజు పాల్గొని, పలువురితో సంతకాలు సేకరించారు. వైద్య కళాశాలలను ప్రైవేటుపరం చేయడం ప్రజలకు నచ్చడం లేదన్నారు. దీంతో ప్రజలు స్వచ్ఛందంగా ముందుకు వచ్చి సంతకాలు చేస్తున్నారని ఎమ్మెల్యే తెలిపారు.