తిరుమలలో బయటపడ్డ మరో స్కాం

తిరుమలలో బయటపడ్డ మరో స్కాం

AP: తిరుమలలో మరో స్కాం వెలుగులోకి వచ్చింది. వేద ఆశీర్వచన పొందే ప్రముఖులకు ఇచ్చే పట్టు వస్త్రాల కొనుగోలులో భారీ మోసం జరిగినట్లు టీటీడీ గుర్తించింది. నగరికి చెందిన VRS ఎక్స్‌పోర్ట్స్ రూ.100 విలువ చేయని పాలిస్టర్ క్లాత్‌ను పట్టు అని రూ.1400కు సరఫరా చేసినట్లు బోర్డు తెలిపింది. 2015-25 మధ్య ఇలా మొత్తం రూ.54 కోట్లు దోచుకున్నట్లు వెల్లడించింది.