దక్షిణ కాశీ నుంచి పుణ్యక్షేత్రాలకు బస్సు సౌకర్యాల ఏర్పాటు
SRCL: వేములవాడ పట్టణంలోని తిప్పాపూర్ బస్టాండ్ వద్ద మహాలక్ష్మి ఉచిత బస్సు ప్రయాణ పథకం ద్వారా రాష్ట్రవ్యాప్తంగా మహిళలు రూ. 10 వేల కోట్ల ప్రయాణ ఛార్జీలు ఆదా చేసిన సందర్భంగా మంగళవారం ఘనంగా వేడుకలు నిర్వహించారు. ఈ కార్యక్రమానికి మున్సిపల్ ఛైర్మన్ పుల్కం రాజు ముఖ్య అతిథిగా హాజరై మహిళా ప్రయాణికులకు ఉచిత టికెట్లు అందజేసి వారిని సత్కరించారు.