'P4 ద్వారా పేదరిక నిర్మూలన సాధ్యమవుతుంది'

GNTR: గుంటూరు తూర్పు ఎమ్మెల్యే నసీర్ చాంబర్ ఆఫ్ కామర్స్ సమావేశంలో మాట్లాడారు. పీ4 ద్వారా పేదరిక నిర్మూలన సాధ్యమవుతుందని, ప్రతి ఒక్కరూ బంగారు కుటుంబాల దత్తతలో భాగస్వాములవాలని పిలుపునిచ్చారు. సీఎం చంద్రబాబు ప్రతిష్టాత్మకంగా ప్రారంభించిన పీ4 సమాజంలో మార్పునకు దోహదపడుతుందన్నారు. 32విభాగాల సభ్యులు ఒక్కొక్కరు 100 కుటుంబాలను దత్తత తీసుకోవాలని సూచించారు.