గల్ఫ్‌లో మా నావికులను కోల్పోయాం: భారత్
హర్మూజ్ జలసంధిని తెరిచే మార్గాలను అన్వేషించేందుకు యూకేలో 60 దేశాలకు పైనే సమావేశమయ్యాయి. ఈ భేటీలో భారత్ తరఫున విదేశాంగ శాఖ కార్యదర్శి విక్రమ్ వర్చువల్‌గా పాల్గొన్నారు. గల్ఫ్‌లో వాణిజ్య నౌకలపై జరిగిన దాడుల్లో నావికులను కోల్పోయిన ఏకైక దేశం తమదేనని అన్నారు. దౌత్యం, చర్చల ద్వారానే ఈ సమస్యకు పరిష్కారం కనుగొనాలని విక్రమ్ సూచించారు.