పండుగలకు స్పెషల్ బస్సులు
TG: ఉగాది, రంజాన్ పండుగల సందర్భంగా ప్రయాణికుల రద్దీని దృష్టిలో ఉంచుకుని TGSRTC ప్రత్యేక బస్సులను అందుబాటులోకి తెచ్చింది. ఈ నెల 17, 18 తేదీల్లో అదనపు సర్వీసులు నడపాలని నిర్ణయించింది. అయితే, ఈ స్పెషల్ బస్సుల్లో 50 శాతం అదనపు ఛార్జీలు వసూలు చేయనున్నట్లు అధికారులు వెల్లడించారు. స్పెషల్ బస్సులు మినహా రెగ్యులర్ బస్సుల్లో సాధారణ ఛార్జీలే అమల్లో ఉంటాయని తెలిపారు.