నర్సింహులపల్లి సర్పంచ్‌ ఏకగ్రీవం

నర్సింహులపల్లి సర్పంచ్‌ ఏకగ్రీవం

SDPT: బెజ్జంకి మండలంలోని నర్సింహులపల్లి గ్రామ పంచాయతీలో ఉపసంహరణలు, గుర్తుల కేటాయింపులు పూర్తయిన తర్వాత సర్పంచ్‌గా జెట్టి రమేశ్‌తో పాటు 6 వార్డు సభ్యులు ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. ఇవాళ ఎంపీడీవో ప్రవీణ్ ఎన్నికల అధికారులతో కలిసి సర్పంచ్ జెట్టి రమేశ్‌కు ఎన్నిక పత్రాన్ని అందజేశారు. మండలంలో మొదటి ఏకగ్రీవ సర్పంచ్‌గా ఎన్నికైన రమేశ్‌ను పలువురు అభినందించారు.