గుండెపోటుతో యువకుడు మృతి

గుండెపోటుతో యువకుడు మృతి

GDWL: అయిజ పట్టణానికి చెందిన రాజగోపాల్ (35) మంగళవారం తెల్లవారుజామున గుండెపోటుకు గురై కన్నుమూశారు. కారు డ్రైవర్‌గా కుటుంబాన్ని పోషించే వ్యక్తి తిరిగిరాని లోకాలకు వెళ్లడంతో భార్యాపిల్లల రోదనలు మిన్నంటాయి. మృతుడికి భార్య మానస, ఇద్దరు కుమార్తెలు ఉన్నారు. చిన్న వయసులోనే ప్రాణాలు కోల్పోవడం పట్ల పట్టణంలో విషాదం నెలకొంది.