వర్షంలో చిక్కుకున్న తల్లిబిడ్డలకు ఎస్సై సాయం

SDPT: బెజ్జంకి మండలంలో భారీ వర్షం కురుస్తున్న సమయంలో పోలీస్ సిబ్బందితో రాత్రి పెట్రోలింగ్ నిర్వహిస్తున్న ఎస్సై బి. సౌజన్య, బెజ్జంకి క్రాసింగ్ వద్ద వర్షంలో ఇబ్బందులు పడుతున్న తల్లి, బిడ్డలను గమనించారు. వారి వివరాలు తెలుసుకుని, తన పోలీస్ వాహనంలో వారిని సురక్షితంగా బెజ్జంకిలోని వారి ఇంటికి చేర్చారు. ఎస్సై చేసిన సహాయానికి వారు కృతజ్ఞతలు తెలిపారు.