ఎన్నికల నిబంధనలపై పోలీసులకు శిక్షణ

ఎన్నికల నిబంధనలపై పోలీసులకు శిక్షణ

NRPT: జిల్లా పరిధిలో జరగనున్న గ్రామ పంచాయతీ ఎన్నికలను శాంతియుతంగా, పారదర్శకంగా నిర్వహించడానికి పోలీసు సిబ్బందికి మక్తల్లోని ఓ ప్రైవేట్ హైస్కూల్లో ప్రత్యేక శిక్షణ తరగతులు నిర్వహించారు. డీఎస్పీ ఎన్. లింగయ్య, డీసీఆర్బీ డీఎస్పీ మహేష్ మార్గదర్శకులుగా హాజరై, ఎన్నికల సమయంలో తప్పనిసరిగా పాటించాల్సిన చట్టపరమైన నిబంధనలను సిబ్బందికి వివరించారు.