VIDEO: కామారెడ్డిలో అంతర్రాష్ట్ర దొంగల ముఠా గుట్టురట్టు

VIDEO: కామారెడ్డిలో అంతర్రాష్ట్ర దొంగల ముఠా గుట్టురట్టు

KMR: జిల్లాలో వరుస దొంగతనాలకు పాల్పడుతున్న అంతర్రాష్ట్ర ముఠాను పోలీసులు అరెస్ట్ చేశారు. వాహన తనిఖీల్లో భాగంగా సిద్ధిపేట జిల్లా దుబ్బాకకు చెందిన నూనె నర్సింలుతో పాటు ఒక మైనర్‌ను అదుపులోకి తీసుకున్నారు. వారి వద్ద నుంచి వెండి నగలు, కాపర్ వైర్లు, రెండు మొబైల్ ఫోన్లు, రూ.4,500 నగదును స్వాధీనం చేసుకున్నారు. కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు వేగవంతం చేశారు.