నేడు విద్యుత్తు సరఫరాలో అంతరాయం

నేడు విద్యుత్తు సరఫరాలో అంతరాయం

సూర్యాపేట పట్టణంలో విద్యుత్తు తీగలకు అడ్డుగా ఉన్న చెట్లకొమ్మల తొలగింపు కారణంగా మంగళవారం సరఫరాలో అంతరాయం నెలకొంటుందని ఏఈ సురేశ్ ఒక ప్రకటనలో తెలిపారు. ఉదయం 8 నుంచి 11 గంటల వరకు శ్రీరాంనగర్, బాలాజీనగర్, బ్రాహ్మణ కల్యాణ మండపం పరిధి, టీచర్స్ కాలనీల్లో అంతరాయం ఉంటుందన్నారు.