శబరిమల ఆలయాన్ని దర్శించుకున్న ఎమ్మెల్యే

NZB: నిజామాబాద్ అర్బన్ ఎమ్మెల్యే ధన్‌పాల్ సూర్యనారాయణ శుక్రవారం శబరిమలలో అయ్యప్ప స్వామి వారిని దర్శించుకున్నారు. ఎమ్మెల్యేగా గెలుపొందిన తర్వాత మొదటి సారి ఆలయానికి వెళ్లి మొక్కులు తీర్చుకున్నారు. ఈ సందర్భంగా అష్ట అభిషేకం నిర్వహించారు. ఆలయ పూజారులు ఎమ్మెల్యేను ఆశీర్వదించి తీర్థప్రసాదాలు అందజేశారు.