'కాంట్రాక్ట్ కార్మికులకు కమిటీ వేతనాలు అమలు చేయాలి'

'కాంట్రాక్ట్ కార్మికులకు కమిటీ వేతనాలు అమలు చేయాలి'

PDPL: దేశ వ్యాప్తంగా బొగ్గు పరిశ్రమల్లో పనిచేస్తున్న కాంట్రాక్టు కార్మికులకు హైపవర్ కమిటీ వేతనాలు అమలు చేయాలని IFTU రాష్ట్ర అధ్యక్షుడు కృష్ణ డిమాండ్ చేశారు. GDKలోని IFTU కార్యాలయంలో బుధవారం ఆయన మాట్లాడారు. కాంట్రాక్ట్, ఔట్‌సోర్సింగ్ కార్మికులకు సమాన పనికి సమాన వేతనం ఇవ్వాలన్నారు. సింగరేణి కాంట్రాక్టు కార్మికులకు 15% బోనస్ సాధన కోసం ఉద్యమిస్తామన్నారు.