'ఈనెల 15 నుంచి ఉగాది ఉత్సవాలు ప్రారంభం'
ELR: జంగారెడ్డిగూడెం పట్టణంలోని శ్రీ నూకాలమ్మ అమ్మవారి ఆలయంలో ఈనెల 15 నుండి 62వ వార్షిక జాతర మహోత్సవాలను నిర్వహిస్తున్నట్లు ఆలయ శాశ్వత ఛైర్మన్ రాజాన పండు తెలిపారు. ఇందుకు సంబంధించి ఆహ్వాన పత్రికలను శుక్రవారం ఆలయ ప్రాంగణంలో ఆవిష్కరించారు. 15వ తేదీ నుండి 22వ తేదీ వరకు అమ్మవారికి శేష పూజా కైంకర్యాలు నిర్వహించడం జరుగుతుందన్నారు.