'జర్నలిస్టులు ప్రజాహితమే లక్ష్యంగా పనిచేయాలి'

NTR: జర్నలిస్టులు ఎల్లప్పుడూ ప్రజా హితమే లక్ష్యంగా పనిచేయాలని మైలవరం ఎమ్మెల్యే వసంత వెంకట కృష్ణప్రసాదు సూచించారు. గొల్లపూడి ఎమ్మెల్యే కార్యాలయంలో ఇబ్రహీంపట్నం ప్రెస్ క్లబ్ నూతన కార్యవర్గ సభ్యులు ఎమ్మెల్యేను బుధవారం మర్యాదపూర్వకంగా కలిశారు. జర్నలిస్టులకు తాను ఎప్పుడూ అండగా ఉంటానన్నారు. అనంతరం నూతన కార్యవర్గ సభ్యులకు ఎమ్మెల్యే శుభాకాంక్షలు తెలిపారు.