నిజాంసాగర్ కాలువలో పడి మహిళ మృతి
KMR: నిజాంసాగర్ కాలువలో పడి ఓ మహిళ మంగళవారం బలవన్మరణానికి పాల్పడింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. బాన్సువాడ మండలం పులికుచ్చతండాకు చెందిన మూడవత్ లలితకు ఆమె బంధువుతో గొడవ జరిగింది. ఈ విషయంలో పెద్దమనుషులు పంచాయతీ నిర్వహించి ఆమెను మందలించడంతో మనస్తాపానికి లోనై నిజాంసాగర్ కెనాల్‌లో దూకింది. గాలింపు చేపట్టగా చించోలి వద్ద కాలువలో మృతదేహం లభ్యమైంది.