మాజీ ఎమ్మెల్యే వర్మ తీరుపై సీఎం అసంతృప్తి
KKD: పిఠాపురం మాజీ ఎమ్మెల్యే SVSN వర్మ తీరుపై సీఎం చంద్రబాబు నాయుడు అసంతృప్తి వ్యక్తం చేశారు. పిఠాపురంలో ఇటీవల చోటుచేసుకున్న ప్రోటోకాల్ రగడపై రాష్ట్ర టీడీపీ చీఫ్ పల్లా శ్రీనివాస్‌తో మాట్లాడారు. సమన్వయంతో పని చేయాలని సూచించినా తరుచూ వివాదాలు వస్తున్నాయని అసహనం వ్యక్తం చేశారు.