VIDEO: వైరాలో కోతుల బెడదతో ప్రజల ఆవేదన
KMM: వైరా మున్సిపాలిటీలో కోతుల బెడద విపరీతంగా పెరిగిందని స్థానికులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. పట్టణంలో పలువురిని గాయపరచడంతో పాటు, కోతులు వాహనాలపై తిరుగుతూ, ఇళ్ల రేకులను పగలగొట్టి లోపలికి దూస్తున్నాయని వాపోతున్నారు. తక్షణమే అధికారులు స్పందించి, ఈ బెడద నుంచి తమను కాపాడాలని ప్రజలు కోరుతున్నారు.