శ్రీవారి అభిషేక సేవలో సినీ నిర్మాత DVV దానయ్య

TPT: తిరుమల శ్రీ వేంకటేశ్వర స్వామి వారిని శుక్రవారం వేకువ జామున పలువురు అభిషేక సేవలో పాల్గొన్నారు. సినీ నిర్మాత DVV దానయ్య, తిరుపతి జిల్లా కలెక్టర్ వెంకటేష్ తదితరులు అభిషేక సేవలో పాల్గొని స్వామివారిని దర్శించుకున్నారు. దర్శనం అనంతరం వీరికి రంగనాయకుల మండపంలో వేద పండితులు వేద ఆశీర్వచనం చేయగా, టీటీడీ అధికారులు తీర్థప్రసాదాలను అందజేశారు.