సహాయ స్ఫూర్తి ఫౌండేషన్‌కి అవార్డు అందజేత

VZM: గజపతినగరం పరిసర గ్రామాల్లో ఉచిత నేత్ర వైద్య శిబిరాలు నిర్వహిస్తున్న సహాయ స్ఫూర్తి సేవా సంస్థకు ఉత్తమ అవార్డు లభించినట్లు ఆ సంస్థ అధ్యక్ష కార్యదర్శులు సాయికుమార్, రేవంత్ తెలిపారు. మంగళవారం విశాఖలో శంకర్ ఫౌండేషన్ వ్యవస్థాపక దినోత్సవం సందర్భంగా జరిగిన కార్యక్రమంలో 21 వైద్య శిబిరాల్లో 521 మందికి శస్త్ర చికిత్సలు చేయించినందుకు అవార్డు లభించిందన్నారు.