33 గ్రామాల్లో డిజిటల్ రీ-సర్వే

33 గ్రామాల్లో డిజిటల్ రీ-సర్వే

NRPT: జిల్లాలోని 13 మండలాలకు చెందిన 33 గ్రామాల్లో పైలెట్ ప్రాజెక్టు కింద డిజిటల్ రీ-సర్వే చేపట్టేందుకు ప్రభుత్వం నోటిఫికేషన్ విడుదల చేసింది. టెండర్ ప్రక్రియ పూర్తయిన వెంటనే భూ సర్వే పనులు మొదలుపెట్టనున్నారు. డ్రోన్లు వంటి ఆధునిక సాంకేతికతతో ఖచ్చితమైన భూ రికార్డులను తయారు చేయడం ఈ ప్రాజెక్టు లక్ష్యమని, దీంతో భూ వివాదాలు తగ్గుతాయని అధికారులు పేర్కొన్నారు.