ఈనెల 25న కాంగ్రెస్ పార్టీ శ్రేణులకు శిక్షణ
PPM: ఈనెల 25 శనివారం ఉదయం 9 గంటల నుండి జిల్లా కాంగ్రెస్ పార్టీ శ్రేణులకు శిక్షణ తరగతులు నిర్వహించడం జరుగుతుందని డిసిసి జిల్లా అధ్యక్షులు వంగల దాలినాయుడు తెలిపారు. ఈ మేరకు ఆయన గురువారం పార్వతీపురంలో విలేకరులతో సమావేశం నిర్వహించారు. రానున్న స్థానిక ఎన్నికల నేపథ్యంలో పార్టీని సంస్థగతంగా బలోపేతం చేసేందుకు పార్టీ శ్రేణులకు శిక్షణ తరగతులు నిర్వహిస్తున్నామన్నారు.