VIDEO: గ్రామ దేవత పూజలతో నామినేషన్ల దాఖలు
మహబూబాబాద్ జిల్లా తొర్రూరు మున్సిపాలిటీలో ప్రధాన పార్టీల అభ్యర్థులు గురువారం భారీగా నామినేషన్లు దాఖలు చేశారు. నామినేషన్ కార్యక్రమంలో పాలకుర్తి ఎమ్మెల్యే యశస్విని రెడ్డి, టీపీసీసీ ఉపాధ్యక్షురాలు ఝాన్సీ రెడ్డి పాల్గొన్నారు. మున్సిపల్ వార్డు అభ్యర్థులతో కలిసి ర్యాలీ నిర్వహించి గ్రామ దేవత బొడ్రాయికి పూజలు చేసి నామినేషన్లు సమర్పించారు.