' సమస్యలను త్వరితగతిన పూర్తి చేయండి'
TPT: చంద్రగిరి మండల కేంద్రంలో అసంపూర్తిగా ఉన్న ఎమ్మార్వో కార్యాలయాన్ని శుక్రవారం ఎమ్మెల్యే పులివర్తి నాని పరిశీలించారు. ఇందులో భాగంగా భవనాన్ని త్వరగా పూర్తి చేయాలని సంబంధిత కాంట్రాక్టర్‌కు ఆదేశించారు. అనంతరం అధికారులతో సమావేశమై, ప్రజల సమస్యలను వేగంగా పరిష్కరించాలని సూచనలు చేశారు.