కొండల్లి తవ్వుతుంటే.. అధికారులు ఏం చేస్తున్నారు.?
PPM: పార్వతీపురం మండలంలో కంకర, మట్టి గుట్టలు అక్రమార్కుల తవ్వకాలతో కనుమరుగు అవుతున్నాయి. జమ్మడివలస,జమదాల కూడలిలో అనుమతులతో కొంత, మాటుగా అధికంగా. అక్రమార్కులు గుట్టను కరగదీశారు. ప్రస్తుతం ఈ ప్రాంతం పెద్దలోయగా మారి ప్రమాదాలను ఆహ్వానిస్తోంది. ఇటీవల మక్కువ మండలం శిర్లాం వద్ద రోడ్డు పనులకని భారీ యంత్రాలతో కొండను పూర్తిగా తవ్వారు. ఎవరైనా అడిగితే అనుమతులంటారు.