జిల్లాలో 30 పోలీస్ యాక్ట్ అమలు

జిల్లాలో 30 పోలీస్ యాక్ట్ అమలు

ప్రకాశం: శాంతి భద్రతల పరిరక్షణ నిమిత్తం ఒంగోలు సబ్ డివిజన్ పరిధిలో డిసెంబర్ నెలాఖరు వరకు 30 పోలీస్ యాక్ట్ అమలులో ఉంటుందని డీఎస్పీ శ్రీనివాసరావు తెలిపారు. ప్రజా సంఘాలు, కార్మిక యూనియన్‌లు, రాజకీయ పార్టీలు, ఇతర సంస్థలు అనుమతి లేకుండా సభలు, సమావేశాలు, ర్యాలీలు, ధర్నాలు నిర్వహించకూడదని స్పష్టం చేశారు. ఈ విషయాన్ని గమనించి పోలీస్ శాఖకు సహకరించాలని కోరారు.