ఆరుగోలనులో చలివేంద్రం ఏర్పాటు

ఆరుగోలనులో చలివేంద్రం ఏర్పాటు

కృష్ణా: బాపులపాడు మండలం ఆరుగోలను గ్రామంలో సోమవారం జనసేన పార్టీ ఆధ్వర్యంలో చలివేంద్రాన్ని ఏర్పాటు చేశారు. వేసవి తీవ్రతను దృష్టిలో ఉంచుకుని గ్రామస్థులకు తాగునీటి సౌకర్యం కల్పించేందుకు ఈ కార్యక్రమాన్ని నిర్వహించారు. చలివేంద్రం ప్రారంభోత్సవానికి గన్నవరం నియోజకవర్గ జనసేన పార్టీ సమన్వయకర్త చలమలశెట్టి రమేష్ బాబు ముఖ్య అతిథిగా హాజరై ప్రారంభించారు.