నాగాయలంకలో నేత్రదానంపై అవగాహన

నాగాయలంకలో నేత్రదానంపై అవగాహన

కృష్ణా: కంటి చూపు లేని వారి జీవితాల్లో వెలుగులు నింపడానికి పలు స్వచ్ఛంద సంస్థలు కృషి చేస్తున్నాయి. నేత్రదానంపై ప్రజల్లో చైతన్యం నింపడానికి నాగాయలంకకు చెందిన సుదర్శి మానవతా సేవా సంస్థ నిర్వాహకులు ముందుకు వస్తున్నారు. గత 7 ఏళ్లుగా 482 కళ్లను విజయవాడకు చెందిన ఎల్వీ ప్రసాద్‌ కంటి ఆసుపత్రికి  దానం చేయించారు. ఎవరైనా నేత్రదానం చేయాలనుకుంటే నం. 9490636466  సంప్రదించాలని కోరారు.