BRS బీసీ గర్జన సభ వాయిదా
KNR: ఈనెల 14న కరీంనగర్‌లో బీఆర్ఎస్ తలపెట్టిన బీసీ గర్జన సభ వాయిదా పడింది. అయితే ఈనెల 14 నుంచి 17 వరకు భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ హెచ్చరికల నేపథ్యంలో సభను వాయిదా వేస్తున్నట్లు మాజీ మంత్రి, ఎమ్మెల్యే గంగుల కమలాకర్ తెలిపారు. స్థానిక ఎన్నికల్లో బీసీలకు 42 శాతం రిజర్వేషన్లు కల్పించాలని డిమాండ్ చేస్తూ ఈ సభను ఏర్పాటు చేశారు.