విజయదశమి సందర్భంగా ఆకట్టుకున్న బాణాసంచా జిగేల్
MBNR: విజయదశమిని పురస్కరించుకుని జిల్లా కేంద్రంలోని బాలుర కళాశాల మైదానంలో ఏర్పాటుచేసిన రాక్షస దహనం ప్రజలను విశేషంగా ఆకట్టుకుంది. ప్రకాశం జిల్లా నుంచి ప్రత్యేకంగా వచ్చిన నిపుణులు వివిధ రకాల బాణా సంచా ఒకదాని తర్వాత ఒకటి కాలుస్తూ అద్భుతమైన ప్రదర్శనలు ఇచ్చారు. ఆఖరిలో మహిషాసురుడి దహన కార్యక్రమాన్ని విజయవంతంగా పూర్తి చేసి కార్యక్రమాన్ని ముగించారు.