రేపు కామారెడ్డిలో జాబ్ మేళా

రేపు కామారెడ్డిలో జాబ్ మేళా

KMR: కలెక్టరేట్‌లో జిల్లా ఉపాధి కల్పన అధికారి కార్యాలయంలో ఈ నెల 15వ తేదీన శనివారం జాబ్ మేళా నిర్వహించనున్నట్లు జిల్లా ఉపాధి కల్పన అధికారి రజని కిరణ్ తెలిపారు. తెలంగాణ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ ఆధ్వర్యంలో వివిధ కంపెనీల్లో 80 ఉద్యోగాలకు బీటెక్, డిగ్రీ, ఇంటర్, ఐటీఐ పూర్తి చేసిన 30 సంవత్సరాలలోపు అభ్యర్థులు జాబ్ మేళాలో పాల్గొనాలన్నారు.