'దేశభక్తి, క్రమశిక్షణ NCC ధ్యేయం'
SKLM: యువతరంలో దేశభక్తి, క్రమశిక్షణ, అంకితభావం మూర్తి భవించేందుకు ఎన్‌సీసీ శిక్షణ తప్పనిసరి అని 14 ఆంధ్ర బెటాలియన్ కమాండింగ్ అధికారి లెఫ్ట్నెంట్ కల్నల్ శశాంక్ కుష్వహ్ అన్నారు. నౌపడ రైల్వేగేటు సమీపంలోని ప్రైవేట్ డిగ్రీ కళాశాలకు నూతనంగా మంజూరైన ఎన్‌సీసీ యూనిట్‌లో అర్హులైన విద్యార్థులతో కేడెట్ల ఎంపిక ప్రక్రియ నిర్వహించారు.