విద్యుత్ తీగ తెగిపడి పంట పొలం దగ్ధం

విద్యుత్ తీగ తెగిపడి పంట పొలం దగ్ధం

NRML: నర్సాపూర్ మండలంలోని నసీరాబాద్ శివారులో సోమవారం రాంపూర్ గ్రామం మంత్రి ఆనందంకు చెందిన వరి పంటలో 11కేవీ విద్యుత్ తీగ తెగి పొలంలో పడటంతో మంటలు చెలరేగాయి. దీంతో 5 గుంటల విస్తీర్ణంలో పంట కాలిపోయింది. చుట్టు పక్కల రైతులు స్పందించి మంటలను అదుపు చేసి విద్యుత్ అధికారులకు సమాచారం అందించారు. అనంతరం మరమ్మతు చేపట్టారు. ప్రభుత్వం ఆదుకోవాలని రైతు కోరాడు.